ప్రేమపెళ్లిపై ఆగ్రహం.. పెళ్ళికూతురు మాయం!

కృష్ణా జిల్లాలోని మండవల్లి మండలం పులపర్రులో ప్రేమ జంట వివాహం ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసుల  సహాయంతో పెళ్లి చేసుకున్న ప్రేమ జంట.. వారి సహాయంతోనే గ్రామంలోకి ప్రవేశించారు. దీంతో గ్రామంలో పంచాయతీ పెట్టిన పెద్దలు… రాత్రికిరాత్రి పెళ్లి కూతురిని మాయం చేశారు. దీనిపై పెళ్లికొడుకు  పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈనేపథ్యంలో విచారణకు వచ్చిన పోలీసులను గ్రామస్తులు నిర్బంధించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు చొరవ తీసుకోవడంతో పోలీసులను గ్రామస్తులు విడిచిపెట్టారు. అయితే, ఇప్పటికీ పెళ్లికుమార్తె ఆచూకీ తెలియలేదు.