మ‌ణిశ‌ర్మ‌,  బాల‌య్య‌ల  13 వ చిత్రం..

నంద‌మూరి బాల‌య్య చిత్రాల్లో సాంగ్స్  మాస్ బీట్ తో  దుమ్ము లేపే విధంగా వుంటాయి. అఫ్ కోర్స్  మాస్ ఇమేజ్ గెయిన్ చేసిన  హీరోల చిత్రాల‌కు అది కంప‌ల్స‌రీ అన్న‌ట్లు చేయిస్తారు.   అయితే ఎన్ని  చిత్రాలు క‌ల‌సి చేసినా..  కెరీర్ ప‌రంగా  ఫెయిల్యూర్  లో వుంటే మాత్రం ప‌క్క‌న పెట్టెస్తారు. కానీ బాల‌య్య మాత్రం  మ‌ణిశ‌ర్మ  కెరీర్ డౌన్ లో వున్న‌ప్ప‌టికి ల‌య‌న్ సినిమాకు పిలిపించి మ‌రి  మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఆఫ‌రిచ్చారు.  మ‌ణిశ‌ర్మ  బాల‌య్య త‌న పై  ఉంచిన న‌మ్మ‌కాని  ఏ మాత్రం వ‌మ్ము చేయ‌లేదు.  ల‌య‌న్ సినిమా ఆల్బ‌మ్ సూప‌ర్ హిట్  అయ్యింది.  మ‌ణిశ‌ర్మ బాల‌కృష్ణ  కాంబినేష‌న్ లో  ఇప్ప‌టి వ‌ర‌కు  12 చిత్రాలు వ‌చ్చాయి అంటే న‌మ్మ‌శ‌క్యం కాదు.  వాటిల్లో  9 సినిమాల ఆడియో సూప‌ర్ హిట్.  మ‌రి ల‌య‌న్ కూడా హిట్ కావ‌డంతో  10   విజ‌య వంత‌మైన  చిత్రాలు  అందించిన  ద‌ర్శ‌కుడిగా  పేరు సంపాదించిన‌ట్లే మ‌రి. ఇక గురువారం  ప్ర‌పంచ వ్యాప్తంగా  ల‌య‌న్ చిత్రం  రిలీజ్ అవుతుంది. త్రిష‌, రాధిక ఆప్టే  హీరోయిన్స్ గా చేశారు. బాల‌య్య నుంచి కోరుకునే  అన్ని మ‌సాల దినుసులు  ల‌య‌న్ చిత్రంలో   పుష్క‌లంగ వున్న‌ట్లు చిత్ర యూనిట్ చెబుతుంది.