సహజీవనం చేస్తున్న మహిళపై అత్యాచారం

మహబూబ్ నగర్ జిల్లా ధన్వాడ మండలం లోని ఓ గ్రామం లో ఓ మహిళపై అత్యాచారం ఘటన వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం… ధన్వాడ మండలం లోని ఓ గ్రామంలో ఓ మహిళ అదే గ్రామానికి చెందిన నారాయణ అనే వ్యక్తితో మూడేళ్ళుగా సహజీవనం చేస్తోంది. ఈ నెల 18న నారాయణ పొలం వద్దకు ఇద్దరూ కలసి వెళుతున్న సమయంలో అదే గ్రామానికి చెందిన కాశిమొల్ల రాజు, చర్లపల్లి రాజు ఆమెను అటకాయించి అత్యాచారం చేశారు. బాధితురాలు సోమవారం నాడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.