ఈ శుక్ర‌వారం ముచ్చ‌ట‌గా మూడు..

ప్ర‌తి శుక్ర‌వారం విడుద‌ల‌కు కొన్ని చిత్రాలు సిద్దం వుతుంటాయి. అలాగే వ‌చ్చే శుక్ర‌వారం ముచ్చ‌ట‌గా మూడు చిత్రాలు రిలీజ్ కు రెడి అయ్యాయి. ముందుగా మ‌ణిర‌త్నం ఓకే బంగారం చిత్రం వ‌స్తుంది. వివాహా వ్య‌వ‌స్థ‌ను హైలెట్ చేస్తూ..నేటీ యువ‌తి యువ‌కుల అభిప్రాయాల్ని, ఆలోచ‌న విధానాన్ని సినిమాటిక్ గా డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం చేశారు. తెలుగులో ఈ సినిమాను మెగా ప్రొడ్యూస‌ర్ దిల్ రాజ్ విడుద‌ల చేస్తున్నారు. సినిమా పై మ‌ణిర‌త్నం ఫ్యాన్స్ భారీ అంచ‌నాలతో వున్నారు.

ఇక అదే రోజు లారెన్స్ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో చేసిన మునీ 3 చిత్రం విడుద‌ల‌కు సిద్దం అయ్యింది. ఇది హ‌ర‌ర్ జాన‌ర్ లో వ‌స్తుంది. గ‌తంలో లారెన్స్ చేసిన మునీ 2 ఘ‌న విజ‌యం సాధించ‌డంతో .. ప్ర‌స్తుతం విడుద‌లకు సిద్ద‌మైన మునీ 3 చిత్రం పై ఒక రేంజ్ లో అంచ‌నాలున్నాయి. తెలుగు, త‌మిళ‌లో ఈ సినిమాను కొనడానికి ఎగ్జీబీట‌ర్స్ పోటి ప‌డుతున్నారంటే ఒక రేంజ్ లో బిజినెస్ అవుతుంద‌ని ఆశిస్తున్నారు . మ‌రి లారెన్స్ ఏం చేస్తాడో. ఈ చిత్రంలో తాప్సీ, నిత్యామీన‌న్ న‌టించారు. లారెన్స్ భిన్న మైన రోల్స్ నాలుగు పోషించాడ‌ని తెలుస్తుంది.

ఇక వార‌ధి పేరు తో అదే రోజు న ఒక యూత్ ఫుల్ ల‌వ్ స్టోరి విడుద‌ల‌కు సిద్దం అయ్యింది. బ‌స్టాఫ్ ఫేమ్ శ్రీ‌దివ్య ..ఆ ఐదుగురు ఫేమ్ కుర్రాళ్లు ఇద్దరు హీరోలుగా చేసిన ఈ చిత్రం కూడా ఈ నెల 17 న రిలీజ్ అవుతుంది. మ‌రి ముచ్చ‌టగా మూడు తెలుగు చిత్రాలు అభిమానుల్ని అల‌రించడానికి సిద్దం అవుతున్నాయి. ఏ సినిమా సూప‌ర్ హిట్ కొడుతుందో లెట్స్ వెయిట్ అండ్ సీ.