త‌మిళ సెగ మొద‌లైంది

ఎర్రచంద‌నం కూలీల ఎన్‌కౌంట‌ర్ ఏమోగానీ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, త‌మిళ‌నాడు మ‌ధ్య చిచ్చు రాజుకుంది. మామూలుగానే త‌మిళుల విష‌యంలో అక్క‌డి ప్ర‌జ‌లంతా ఒక్క‌టవుతారు. ప్ర‌పంచంలో ఎక్క‌డ ఏం జ‌రిగినా అంతా క‌లిసి నిర‌స‌న వ్య‌క్తం చేస్తారు. ఈ విష‌యంలో రాజ‌కీయ పార్టీలు, సినీ ప్ర‌ముఖులు, అన్ని రంగాల వారూ ఏక‌మ‌వుతారు. ఇప్పుడు ఏకంగా 20 మంది కూలీల‌ను ఎన్‌కౌంట‌ర్ చేశారంటే మామూలు విష‌యం కాదు. అందుకే ఘ‌ట‌న గురించి తెలియ‌గానే ఆ కోప‌మంతా ఏపీకి చెందిన బ‌స్సుల‌పైనో, ప్ర‌జ‌ల‌పైనో చూపిస్తున్నారు. చిత్తూరు జిల్లాకు స‌మీపంలో ఉండే త‌మిళ ప్రాంతాల్లో ఇది ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. వేలూరులో ఏపీ బ‌స్సుల‌పై దాడి జ‌రిగింది. కోయంబేడు బ‌స్టాండులోనూ ఏపీ బ‌స్సు అద్దాల‌ను ప‌గుల‌గొట్టారు. ఈ నేప‌థ్యంలో ఏపీ నుంచి అటు వైపు వెళ్లే బ‌స్సుల‌న్నింటినీ ఆర్టీసీ ఆపేసింది.