హీరోగా మొదటి పుట్టిన రోజు…

హీరో త‌న‌యుడు హీరోగా ప‌రిచ‌యం అవుతుంటే అభిమానుల్లో ఒక తెలియ‌న ఆనందం . అలాగే అక్కినేని న‌ట వార‌సుల్లో మూడో జ‌న‌రేష‌న్ కు చెందిన అఖిల్ ప‌రిచ‌యం జ‌రిగింది. అఖిల్ విష‌యంలో నాగార్జున ఎన్నో జాగ్ర‌త్తలు తీసుకుని సీనియ‌ర్ డైరెక్ట‌ర్ వివి వినాయ‌క్ చేతిలో పెట్టారు. ఒక సైంటిఫిక్ ఫిక్ష‌న్ స్టోరీని అఖిల్ కు ఓకే చేశారు. అఖిల్ స‌ర‌స‌న సాయోష సైగ‌ల్ హీరోయిన్ గా ప‌రిచ‌యం అవుతుంది. హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం టీజ‌ర్ ను అఖిల్ పుట్టిన రోజు ( ఏప్రిల్ 8) న రిలీజ్ చేయ‌డానికి రంగం సిద్దం చేస్తున్న‌ట్టు నితిన్ ట్విట్ చేశారు. ఈ సినిమాను ఎక్కువ శాతం విదేశాల్లో చే్స్తున్నారు. సో అఖిల్ హీరోగా జ‌రుపుకుంటున్న తొలి బ‌ర్త్ డే ను ఎలా జ‌రుపుతారో ప్రొడ్యూస‌ర్ నితిన్.

గ‌త యేడాది విక్ర‌మ్ కుమార్ అక్కినేని హీరోలతో చేసిన ఫ్యామిలి ప్యాక్ `మ‌నం `చిత్రంలో క్లైమాక్స్ సీన్ లో క‌నిపించి అభిమానుల్ని ఆశ్చ‌ర్య ప‌రిచాడు. ఆ సీన్ లో అఖిల్ ను చూసిన మ‌హేష్ బాబు.. అఖిల్ సూప‌ర్ స్టార్ అవుతాడ‌ని ట్విట్ చేసిన విష‌యం తెలిసిందే.