స‌మ్మ‌ర్ కి త‌గ్గుతున్న సినిమా ల సంద‌డి ?

ఇది వ‌ర‌కు స‌మ్మ‌ర్ అంటే దాదాపు అంద‌రూ హీరోల సినిమాలు రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేసేవారు.అలాంటిది చిత్ర ప‌రిశ్ర‌మలో వ‌స్తున్న మార్పుల కార‌ణంగా పెద్ద సినిమాల సంఖ్య త‌గ్గుతూ వ‌స్తోంది.ఈ వేస‌విని చూసుకుంటే సీనియ‌ర్ హీరోల్లో బాల‌క్రిష్ణ ఒక్క‌డే పోటీలో
ఉన్నాడు. ల‌య‌న్ సినిమా సిద్ధ‌మ‌వుతుంది, నాగార్జున సోగ్గాడే చిన్నినాయ‌నా ఇంకా షూటింగ్ పూర్తి చేసుకోలేదు. వెంక‌టేష్ త‌ర్వాతి సినిమా అయితే ఫైన‌లైజ్ కాలేదు.మ‌హేష్ బాబు జూన్ కి వెళ్ళిపోయాడు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా స్క్రిప్టే రెడీ కాలేదు.ప్ర‌భాస్ బాహూబ‌లి జ‌లైలో కాని ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేలాలేదు.ఎన్.టి.ఆర్ సినిమా షూటింగ్ స‌మ్మ‌ర్ లో స్టార్ట‌వుతుంది.రామ్ చ‌ర‌ణ్ సినిమా షూటింగ్ జ‌రుగుతోంది.ఇక ఈ స‌మ్మ‌ర్ కి వ‌స్తున్న హీరోలు - అల్లు అర్జున్ స‌న్ ఆఫ్ స‌త్య‌మూర్తి ఏప్రిల్ 9 న వ‌స్తుంది. ఈ సినిమా దాదాపు 62 కోట్ల వ‌ర‌కు బిజినెస్ చేసింది.త‌నే ఓ ప్ర‌ధాన పాత్రలో న‌టించిన రుద్ర‌మదేవి ఏప్రిల్ లోనే వ‌స్తుంద‌ని చెబుతున్నారు.

ఏప్రిల్ 24 న నాగ‌చైత‌న్య  దోచేయ్ , నాగ‌శౌర్య జాదూగాడు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.మే 1న ల‌య‌న్, మే7న ర‌వితేజ కిక్ -2, మే 14న రామ్ పండ‌గ చేస్కో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.అలాగే అల్ల‌రి న‌రేష్ సినిమా (ఇంకా పేరు పెట్ట‌లేదు) కూడా గ్యాప్ చూసుకుని వ‌స్తుంది. సందీప్ కిష‌న్ టైగ‌ర్ కూడా రిలీజ్ కావ‌ల‌సిఉంది.డ‌బ్బింగ్ సినిమాల్లో ఉత్త‌మ విల‌న్ ఏప్రిల్ 17న, మ‌ణిర‌త్నం ఓ.కే.బంగారం ఏప్రిల్ లోనే విడుద‌ల కానున్నాయి.ఇంకా గ్యాప్ చూసుకుని మ‌రికొన్ని చిన్నా చిత‌కా సినిమా లు ప్రేక్ష‌కుల ముందుకి రావ‌డానికి త‌హ‌త‌హ‌లాడుతున్నాయి. ఏది ఏమైనా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సంద‌డి త‌క్కువే అవుతుంది.