పెంపుడు కుక్కను ఉరివేసి తల్లీకూతుళ్ల ఆత్మహత్య

పెంపుడు కుక్కకు ఉరివేసి చంపి, ఆపై తల్లీకూతుళ్లు ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంఘ‌ట‌న ప్ర‌కాశం జిల్లాలో జ‌రిగింది. ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం దీనమ్మదిబ్బలో శుక్రవారం ఈ సంఘటన జరిగింది. చనిపోయిన వారిని కనకరత్నం(60), శృతి(25)గా గుర్తించారు. వీరు మ‌ర‌ణ వాంగ్మూలంలో తన తండ్రి రూ.30వేలు అప్పు తీసుకుంటే అప్పుచ్చిన వారు రూ.42 వేలు అని చెప్పి అబద్ధమాడారని, భాషా, హౌస్ ఓనర్‌ భాస్కర్‌ మరో 10 మంది తమ మరణానికి కారణమని, వారందరినీ జైలుకు పంపాలని శృతి నోట్ రాసింది. ఆ నోట్‌ను ఆమె తండ్రి మల్లపురెడ్డి ప్రవీణ్‌కుమార్‌ తహసీల్దార్‌, డీఎస్పీల సమక్షంలో చదివాడు. సూసైడ్‌ నోట్‌ను ఫిర్యాదుగా స్వీక‌రించి అందులో పేర్కొన్న వారిపై కేసు న‌మోదు చేయ‌నున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తానని ఇద్దరు వ్యక్తుల నుంచి ప్రవీణ్‌కుమార్‌ రూ. 32 వేలు తీసుకున్నాడని పోలీసులు తెలిపారు.-పీఆర్‌