గొప్ప ప్రధాని మోదీ! …ఇండియాటుడే-సిసిరో ఒపీనియన్‌ పోల్‌

పది నెలల అధికార కాలం.. 2014 సార్వత్రిక ఎన్నికల్లో సునామీ సృష్టించి.. కాం‌సను కొట్టుకుపోయేలా చేసి బీజేపీ అధికార పీఠాన్నెక్కింది! పాలనలో కాస్తంత వైభవం తగ్గినా అధిక శాతం మంది ఇప్పటికీ ప్రధానిగా మోదీకే దన్నుగా నిలిచారు. దేశాధినేతల్లో ఆయనే గొప్ప ప్రధానిగా చెప్పారు. శుక్రవారం ఇండియాటుడే-సిసిరో సంయుక్తంగా నిర్వహించిన ‘ఏ మూడ్‌ ఆఫ్‌ ద నేషన్‌’ ఒపీనియన్‌ పోల్‌లో అత్యధిక ప్రజ ఆయనకే ఓటేశారు. ఇక బెస్ట్‌ సీఎం కేటగిరీలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు మూడో స్థానంలో నిలిచారు. తొలి రెండు స్థానాలను ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌లు సాధించారు. దేశవ్యాప్తంగా 12 వేల మందిపై నిర్వహించిన ఈ సర్వేలో 22 శాతం మంది మోదీ పాలన అద్భుతంగా ఉందని కితాబివ్వగా.. 38 శాతం మందేమో బాగుంది అని అభిప్రాయపడ్డారు. 11 శాతం మంది మాత్రం అసంతృప్తి వ్యక్తం చేశారు. వారు మోదీ పాలన చాలా దయనీయంగా ఉందని పెదవి విరిచారు. మోదీ అభివృద్ధి, మెరుగైన పాలనే ధ్యేయంగా పని చేస్తున్నారని 52 శాతం మంది చెప్పగా.. ఊరట కలిగించే విషయమేంటంటే..16 శాతం మంది మాత్రమే హిందూత్వ సిద్ధాంతాలతో పనిచేస్తున్నారన్నారు.-పీఆర్‌