సిమీ ఉగ్రవాదులుగా అనుమానం!

న‌ల్గొండ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమైన దుండగులు సిమీ ఉగ్రవాదులు అంజాద్‌, అస్లాంగా భావిస్తున్నారు. వీరిద్దరికి మహారాష్ట్రలో కూడా నేరచరిత్ర ఉంది. గతంలో ఖండ్వా జైలు నుంచి వీరు పరారయ్యారు. ఖండ్వా పోలీస్‌ స్టేషన్‌లో నిందితులపై 2009, 2010లో కేసులు నమోద‌యి ఉన్నాయి. ముంబై యాంటీ టెర్రరిస్ట్‌ వాంటెడ్‌ లిస్టులో అంజాద్‌, అంస్లాం పేర్లు ఉన్నాయి. 8వ తరగతి వరకు చదువుకున్న అస్లాంకు చిన్నప్పటి నుంచే నేర చరిత్ర ఉంది. 2010లో మణప్పురం గోల్డ్‌ఫైనాన్స్‌లో చోరీకి పాల్పడిన అంజాద్‌ 12 కిలోల బంగారం, మూడు లక్షల రూపాయ‌ల న‌గదు అపహరించాడు. అబూ ఫైజల్‌ గ్యాంగ్‌లో అంజాద్‌, అస్లాం కీలక సభ్యులు. 2007లో కేరళలో ఉగ్రవాద సాయుధ శిబిరం నిర్వహించారు. గ్యాంగ్‌ దోపిడీ ద్వారా డబ్బు సంపాదించిన ఫైజల్‌ గ్యాంగ్‌ 2013లో మోడీ ర్యాలీలో బాంబులు పేల్చిది ఈ ముఠానే. మహారాష్ట్ర, తమిళనాడులో బాంబు పేలుళ్లతో వీరికి సంబంధాలున్నాయి. 2014 ఫిబ్రవరిలో చొప్పదండి బ్యాంకు దోపిడీ ఈ ముఠా పనే. వీరిద్దరి నేర చరిత్ర తెలిసిన పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మరోవైపు డీజీపీ మాత్రం వీరు తీవ్రవాదులుగా నిర్ధారణ కాలేదని, విచారణ అనంతరం పూర్తి వివరాలు తెలియజేస్తామని అంటున్నారు. కాగా న‌ల్గొండ‌ జిల్లా జానకీపురం-చిన్నకోడూరులో జరిగిన ఎన్‌కౌంటర్‌లో తీవ్రంగా గాయపడిన ఎస్సై సిద్ధయ్య, సీఐ బాలగంగిరెడ్డిలను మెరుగైన చికిత్స నిమిత్తం ఎల్‌బీనగర్‌ కామినేని ఆస్పత్రికి తరలించారు. దుండగుల కాల్పుల్లో ఎస్సై సిద్ధయ్యకు మెడ, భుజానికి బుల్లెట్ల గాయాలు అవగా, సీఐ బాలగంగిరెడ్డి పొట్టలోకి బుల్లెట్‌ దూసుకెళ్లింది.-పీఆర్‌