ఈనెల 6న నిర్భయ కేసు విచారణ‌

దాదాపు 14 నెలల తర్వాత నిర్భయ కేసు విచారణకు రానుంది. మార్చి 31న ఈ మేరకు సుప్రీంకోర్టు ఓ ప్రత్యేక సర్య్కులర్‌ జారీ చేసింది. 2014 ఆగస్టు 25వ తేదీన నిర్భయ కేసును సుప్రీంకోర్టు విచారిస్తూ కొత్త నిబంధనల ప్రకారం ఉరిశిక్ష పడినవారి కేసులను త్రిసభ్య ప్రత్యేక బెంచ్‌ విచారించాలని పేర్కొంది. ఈ మేరకు విచారణకు ఏర్పాటు చేయాలని రిజిస్ట్రిని ఆదేశించింది. కాని ఇప్పటివరకు రిజిస్ట్రి ఎలాంటి చర్య తీసుకోలేదు. దీంతో మార్చి 31న సుప్రీం సర్క్యులర్‌ జారీ చేసింది. కోర్టు ఎదుట పెండింగ్‌లో ఉన్న 11 కేసులను లిస్ట్‌ చేసింది. ఇందులో 7వ నెంబర్‌ కేసు నిర్భయకు సంబంధించినది. మే 6న ఈ కేసుల విచారణ ఆరంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఈ మేరకు రిజిస్ట్రి చర్యలు తీసుకోవలసి ఉంది. అయితే మే 6 లోపల ఈ కేసుల విచారణ మొదలవ్వాలంటే త్రిసభ్య బెంచ్‌లను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఏ మాత్రం ఆలస్యం జరిగినా విచారణ జులైకి వాయిదా ప‌డుతుంది. ఎందుకంటే మే 17 నుంచి జూన్‌ 30 వరకు సుప్రీం కోర్టుకు వేసవి సెలవులు. ఈలోగా ప్రత్యేక బెంచ్‌ ఖరారు కాకుంటే విచారణ జులైలోనే మొదలవుతుందన్న మాట!-పిఆర్‌