మారన్‌ సోదరుల ఆస్తుల జప్తు!

సన్‌ నెట్‌వర్క్‌ గ్రూపు యజమానులు దయానిధి మారన్‌, కళానిధి మారన్‌కు చెందిన రూ. 742 కోట్ల ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) జప్తు చేసింది. ఎయిర్‌సెల్‌, మాక్సిస్‌ సంస్థలకు కాంట్రాక్టులు ఇవ్వడంలో అప్పటి కేంద్ర మంత్రిగా ఉన్న దయానిధి మారన్‌ కీలకపాత్ర వహించారన్న ఆరోపణలున్నాయి. ఆ సంస్థలకు కాంట్రాక్టులు ఇచ్చినందుకుగాను – నీక‌ది-నాకిది -(క్విడ్‌ ప్రోకో) కింద సన్‌నెట్‌ వర్క్‌లో ఆయా సంస్థలు పెట్టుబడులు పెట్టినట్టు ఆరోపణలొచ్చాయి. ఈ కేసులో ఈ 742 కోట్ల రూపాయలను మారన్‌ బ్రదర్స్‌ మనీ లాండరింగ్‌ చేశారని సీబీఐ గుర్తించింది. అప్పట్లో దయానిధి మారన్‌ కేంద్ర టెలికాం మంత్రిగా ఉన్నారు. సన్‌ నెట్‌ వర్క్‌కు అధినేతగా కళానిధి మారన్‌ వ్యవహరిస్తున్నారు. దీనికి సంబంధించి వీరిద్దరిపై చార్జిషీటు దాఖలు చేసింది. ఈ ఛార్జిషీటు ఆధారంగా దర్యాప్తు చేస్తున్న ఈడీ ఈ మొత్తం ఆస్తులను జప్తు చేసినట్టు ప్రకటించింది.-పిఆర్‌