మహారాష్ట్రలో సతీ సహగమనం!

ముంబై: త‌న భ‌ర్త లేకుండా తాను బ‌త‌క‌లేన‌నుకున్న ఓ భార్య ఆయ‌న చితిలోనే అసువులు బాసి స‌తీస‌హ‌గ‌మ‌నానికి పాల్ప‌డింది. మహారాష్ట్రలోని లాతురు జిల్లాలో ఈ సంఘ‌ట‌న జ‌రిగింది. లాతూరు జిల్లా లోహతా గ్రామ వాసి తుకారం(55) గుండెపోటుతో అనుకోకుండా చనిపోయాడు. అతనికి భార్య ఉష (50), ఇద్దరు కుమారులున్నారు. తుకారం చనిపోవ‌డంతో ఆమె ఆ బాధ‌ను త‌ట్టుకోలేక పోయింది. బోరుబోరున విల‌పించింది. ఆ రోద‌న ఆమె మ‌న‌సును సేద తీర్చ‌లేదు. అంతే… ఆమె అంత్యక్రియలు నిర్వహించిన రోజు అదృశ్యమైంది. వెదికినా ఫ‌లితం లేకపోయింది. తుకారాం అస్థికల సేకరణకు వెళ్లినప్పుడు అత‌ని చితిపై ఆమె శరీరం దహనమై ఉండటం స్థానికులు గమనించారు. ఆమె భ‌ర్త‌తోపాటే చితిలో ఆహుతైపోయి ఉంటుంద‌ని భావిస్తున్నారు.