జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల‌పై కేసీఆర్ దృష్టి!

తెలంగాణ ముఖ్య‌మంత్రి కె. చంద్ర‌శేఖ‌ర‌రావు గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌పై దృష్టి సారించారు. దీనికి సంబంధించి ఆయ‌న గురువారం హైద‌రాబాద్ ప్రాంతానికి చెందిన మంత్రులు, పార్ల‌మెంట‌రీ కార్శ‌ద‌ర్శుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. మొన్న‌టి ఎన్నిక‌ల్లో హైద‌రాబాద్‌, రంగారెడ్డి, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఆ స్థానం కోల్పోయిన నేప‌థ్యంలో కేసీఆర్ ముందుగానే మేల్కొని జిహెచ్ఎంసీ ఎన్నిక‌ల‌పై దృష్టి సారించిన‌ట్టు క‌నిపిస్తున్నారు. ముఖ్యంగా న‌గ‌రంలో ప్ర‌జ‌ల‌కు అందుతున్న సౌక‌ర్యాల‌ను తెలుసుకునే ప్ర‌య‌త్నం చేశారు. పౌర సేవ‌ల‌కు అత్య‌ధిక ప్రాధాన్యం ఇవ్వాల‌ని ఆయ‌న సూచించారు.
కాగా జ‌ల‌య‌జ్ఞం సంద‌ర్భంగా ఇళ్ళు కోల్పోయి నిర్వాసితులైన బాధితుల‌కు ల‌బ్ధి చేకూరేలా తెలంగాణ ప్ర‌భుత్వం జీ.వో. జారీ చేసింది. దీని ప్ర‌కారం… క‌రీంన‌గ‌ర్‌, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాల్లోని నిర్వాసితుల‌కు మొత్తం 7,311 ఇళ్ళు మంజూరు చేసింది. ఇందులో క‌రీంన‌గ‌ర్ జిల్లా వేముల‌వాడ‌, సిరిసిల్ల‌, బోయిన‌ప‌ల్లి మండ‌లాల్లోని వారికి 4,723 ఇళ్ళు, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా పెబ్బేరు, గ‌ట్టు, మ‌క్త‌ల్ మండ‌లాల్లోని నిర్వాసితుల‌కు 2588 గృహాలు మంజూరు చేసిన‌ట్టు ఆ జీవోలో పేర్కొంది.-పీఆర్‌