ఉగ్రవాదులు – భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు

ఉత్త‌ర కాశ్మీర్‌లోని టాంగ్ మార్గం వ‌ద్ద‌ ఉగ్రవాదులు – భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ సంఘ‌ట‌న‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ముగ్గురు చ‌నిపోయారు. బారాముల్లాలో ప్రవేశించిన ఉగ్రవాదులను పోలీసులు అడ్డుకున్నారు. పట్టణ ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులు చొరబడినట్లు తెలియ‌గానే భ‌ద్ర‌తాద‌ళాలు అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశాయి. దాంతో వారు కాల్పుల‌కు దిగారు. భద్రతా సిబ్బంది ఉగ్రవాదులపై ఎదురు కాల్పులు జ‌ర‌ప‌డంతో వారు ఓ ఇంటిలోకి వెళ్ళి దాక్కునే ప్ర‌య‌త్నం చేశారు. వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన భ‌ద్ర‌తాద‌ళాలు దాన్ని చుట్టుముట్టాయి. మిలిటెంట్లు, పోలీసులకు మధ్య హోరా హోరీగా కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఒక ఆర్మీ జవాను, ఒక పోలీసు, ఒక పౌరుడు ఇప్ప‌టికే మృతి చెందారు. ఇంకా కాల్పులు జ‌రుగుతూనే ఉన్నాయి._పీఆర్‌