యాక్సిడెంట్ కేసులో కీలక మలుపు

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హిట్ అండ్ రన్ కేసు విచారణ తీరు చూస్తోంటే ఆయన ఈ కేసులోంచి బయట పడినట్లేనని క‌నిపిస్తోంది. 2002లో సెప్టెంబర్ 28న ముంబైలో ఫుట్‌పాత్‌పై పడుకున్న వారిపై నుంచి కారుని పోనిచ్చి ఒకరి మృతికి కారణమైన ఈ కేసులో సల్మాన్ నిందితుడిగా విచారణ ఎదుర్కుంటున్నాడు. అయితే, ఈ ప్రమాదం జరిగిన సమయంలో కారు నడిపింది తానే అంటూ సల్మాన్ డ్రైవర్ అశోక్ సింగ్ కోర్టులో అంగీకరించాడు. దీంతో ఈ కేసు స్వ‌రూప‌, స్వ‌భావాలు మారిపోయే ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు స‌ల్మానే ఈ ప్ర‌మాదానికి కార‌ణ‌మ‌ని ఆరోపిస్తూ వ‌చ్చిన ప్రాసిక్యూష‌న్ ఈ కేసు ఇప్పుడెలా ముందుకు న‌డుపుతుంద‌న్న సందేహం అంద‌రికీ రావ‌డం ఖాయం. ఈ ప‌రిణామాలు చూస్తుంటే ఈ కేసు నుంచి స‌ల్మాన్‌ను బ‌య‌ట ప‌డేయ‌డానికి చాలా క‌ష్ట‌ప‌డిన‌ట్టే క‌నిపిస్తుంది ప‌రిస్థితి!-పిఆర్‌