ప‌వ‌న్ క‌ళ్యాణ్ రికార్డ్స్ పై క‌న్నేసిన అల్లు అర్జున్

అల్లు అర్జున్ – త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ లో వ‌చ్చిన జులాయి సినిమా పెద్ద‌గా స‌క్సెస్ కాలేదు. కాని బ‌న్నీ – త్రివిక్ర‌మ్ విడివిడిగా చేసిన రేసుగుర్రం (55 కోట్లు ) , అత్తారింటికి దారేది ( 70 కోట్లు ) వ‌సూలు చేశాయి. ఇప్పుడు అల్లు అర్జున్ -త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ లో వ‌స్లున్న స‌న్ ఆఫ్ స‌త్య‌మూర్తి చిత్రం 60 కోట్ల పైనే బిజినెస్ చేసింది. అల్లు అర్జున్ ఈ సినిమా పై చాలా న‌మ్మ‌కంగా ఉన్నాడు. అత్తారింటికి దారేది క‌లెక్ష‌న్స్ ఈజీగా స‌న్ ఆఫ్ స‌త్య‌మూర్తి క్రాస్ చేస్తుంద‌ని స‌న్నిహితుల‌తో అంటున్నాడ‌ట‌. అయితే అదంత సాధ్యం కాద‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానులు అంటున్నారు. మ‌రి బ‌న్నీ ఆశ నెర‌వేరుతుందో లేదో చూడాలి.