చ‌ల్లారిన గ‌రం

సాయికుమార్ వార‌సుడు ఆదికి బాగుంటాడ‌ని , డాన్సులు బాగా చేస్తాడ‌ని పేరు వ‌చ్చినా ల‌క్కు క‌లిసి రాలేదు. ఆ న‌లుగురు ఫేమ్ మ‌ద‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఆ మద్య ఆది హీరోగా గ‌ర‌మ్ అనే పేరుతో ఓ సినిమా స్టార్ట్ అయింది. కొన్ని రోజులు షూటింగ్ కూడా చేశారు. అయితే స్క్రిప్ట్ లో స‌మ‌స్య‌ల వ‌ల్ల నిర్మాత ఆ ప్రాజెక్ట్ ప‌క్క‌న ప‌డేశారు. శ్రీ‌నివాస్ గ‌విరెడ్డి క‌ధ‌, మాట‌లు అందించిన ఆ చిత్రం పాట‌లు కూడా రికార్డ్ చేశారు. నిర్మాత మ‌రో హీరోతో , మ‌రో స్క్రిప్ట్ తో సినిమా చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాడు.