ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా బీజేపీ

ప్రపంచంలోనే క‌మ‌లం అతిపెద్దగా విక‌సించింది. రాజ‌కీయ‌ పార్టీగా భారతీయ జనతాపార్టీ కొత్త చ‌రిత్ర‌ను సృష్టించింది. బీజేపీలో సభ్యత్వం తీసుకున్న వారి సంఖ్య ఆదివారంనాటికి 8.8 కోట్లకు చేరుకుంది. సభత్వ నమోదుకు ఈరోజుతో గడువు ముగుస్తున్నందున స‌భ్యుల సంఖ్య ఈరోజు మ‌రింత పెర‌గ‌వ‌చ్చ‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. మామూలుగా ఉత్త‌రాది రాష్ట్రాల్లో బీజేపీకి అభిమానులు ఎక్కువ‌……….. . కాని ఈసారి ద‌క్షిణాదిలో కూడా గ‌ణ‌నీయంగా పార్టీలో చేరార‌ని ఆ పార్టీ నాయ‌కుడొక‌రు చెప్పారు ఇప్పటి వరకు 8.6 కోట్ల మంది సభ్యులతో కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ చైనా ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా ఉంది. ఇపుడు ఆ రికార్డును బీజేపీ బ‌ద్ద‌లుగొట్టింది. అంటే ఇపుడు ఎర్ర దండును కాషాయ దళం అధిగమించింద‌న్నమాట.-పిఆర్‌-