మే మొదటి వారంలో కిక్ 2 విడుద‌ల‌

హీరో రవితేజ, డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో వచ్చిన కిక్ చిత్రం ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు కిక్ సినిమాకి సీక్వెల్గా వస్తున్న కిక్ 2 చిత్రాన్ని హీరో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు. నిజానికి రవితేజ సినిమాలు బడ్జెట్ 30 కోట్లు దాటవు. కాని రేసు గుర్రం సక్సెస్‌తో ఊపు మీదున్న సురేందర్ రెడ్డి ఈ సినిమాని 40 కోట్లపైన వ్యయంతో నిర్మిస్తున్నార‌ని తెలుస్తుంది. ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో రవితేజ, రకుల్ ప్రీత్ సింగ్ పై పాటల చిత్రీకరణ‌ చేస్తున్నారు. దీనితో చిత్రం షూటింగ్ పూర్త‌యిన‌ట్టే. పోస్ట్ ప్రొడక్షన్, ఇతర సినిమాల రిలీజ్ డేట్స్ చూసుకొని కిక్ 2 ని మే మొదటి వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.