ఇదీ సొంత కధ కాదట….

డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఇంతకాలం తన సొంత స్క్రిప్ట్ ల తోనే సినిమాలు తీస్తు వచ్చాడు. అయితే ఎన్.టీ.ఆర్ టెంపర్ చిత్రం వక్కంతం వంశీ కధతో తీశాడు. ఆ సినిమా మంచి హిట్ అయ్యింది. దాంతో సొంత స్క్రిప్ట్ ల కోసం తంటాలు పడకుండా, తన తదుపరి సినిమా కోసం వేరే రచయిత కధను ఎంపిక చేసుకున్నాడ‌ట‌. ఛార్మీతో రూపొందిస్తున్న “జ్యోతి లక్ష్మి” సినిమా ప్రముఖ రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి నవల ఆధారంగా తీస్తున్నాడట. ఇక ముందు కూడా ఇదే ట్రెండ్ ఫాలో అయిపోతాడేమో మన పూరి జగన్నాధ్.