సుప్రీం మార్గదర్శకాల మేరకే కంప్యూటరీకరణ

సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించే రేషన్‌ కార్డులకు ఆధార్‌ కార్డులను అనుసంధానం చేసి ‘ఎండ్‌-టు-ఎండ్‌ కంప్యూటరైజేషన్‌ ఆఫ్‌ పీడీఎస్‌ ఆపరేషన్స్‌’ కింద ఎలక్ర్టానిక్‌ తూకం యంత్రాలతో రేషన్‌ షాపుల నుంచి నిత్యావసర వస్తువులు సరఫరా చేయాలని సంక‌ల్పించిన‌ట్లు ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు విన్న‌వించింది. పైలట్‌ ప్రాజెక్టు కింద 2012లో అప్ప‌టి ప్ర‌భుత్వం తూర్పుగోదావరి జిల్లాలో ఎలక్ర్టానిక్‌ తూకం యంత్రాలు ప్ర‌వేశ‌పెట్టింద‌ని, అక్క‌డ అవి విజయవంతం అవడంతో రాష్ట్రంలోని 29,892 రేషన్ షాపుల్లో ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నామ‌ని ప్ర‌భుత్వం స్పష్టం చేసింది. దీన్ని సవాల్ చేస్తూ ఏపీ చౌకధరల దుకాణాల సంఘాల సంక్షేమ సమాఖ్య అధ్యక్షుడు జి. వెంకటేశ్వర్లుగౌడ్‌ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంలో కోర్టు ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేస్తూ ఈ వివ‌ర‌ణ ఇచ్చింది._పిఆర్‌