త్రివిక్రమ్ కి ఈసారైనా అదృష్టం కలసి వస్తుందా ?

డైరెక్టర్ త్రివిక్రమ్ అనగానే మాటల మాంత్రికుడు అని గుర్తుచేసుకుంటాం. ఇదే అతనికి తెలుగు భాషలో కలసి వచ్చినా, ఇతర భాషల్లో మైనస్ గానే భావించాలి. త్రివిక్రం కన్నడంలో ‘స్వయంవరం’ తీస్తే భారీ ఫ్లాప్ ను మూటగట్టుకుంది. చిరునవ్వుతో, నువ్వు నాకు నచ్చావ్ తమిళ్ లో హీరో విజయ్ తోతీస్తే దారుణమైన్ ఫ్లాప్ చవిచూసాడు. మహేశ్ బాబు హీరోగా తెలుగులో రిలీజ్ అయిన ‘అతడు’ భారీ హిట్ కొట్టినా అదే సినిమా హిందీలో బాబిడియోల్ తో రీమేక్ చేయగా అది ఫ్లాప్ అయ్యింది. మన్మధ కన్నడంలో ఉపేంద్ర, దీపికా పదుకునే తో “ఐశ్వర్య” పేరుతో తీస్తే అదీ ఫ్లాపే. వీటన్నిటికి కారణం త్రివిక్రమ్ సినిమాలో మాటల గారడి తప్ప కధా బలం ఉండదు. అందుకే ఇతర భాషలవారు త్రివిక్రమ్ సినిమాలు రీమేక్స్ పట్ల ఆసక్తి చూపించరు. ఇప్పుడు తమిళ్ హీరో ప్రశాంత్ తో(చామంతి, జీన్స్ హీరో) జులాయి సినిమా తమిళ్ లో రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమా రిలీజ్ దగ్గర పడటంతో ప్రశాంత్ లో టెన్షన్ మొదలైందట..ఈ సారైనా త్రివిక్రమ్ కి ఇతర భాషల్లో కలసి వస్తుందోలేదో  చూడాలి…