లండన్ లో రాణిరుద్రమ దేవి రీరికార్డింగ్

హీరోయిన్ అనుష్క రాణిరుద్రమదేవిగా, డైరెక్టర్ & ప్రొడ్యూసర్ గుణశేఖర్ తీస్తున్న రాణిరుద్రమదేవి సినిమా ఆడియో ఇటీవల రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇళ‌యరాజా సంగీతం సమకూర్చిన ఈ చిత్రం రీరికార్డింగ్ లండన్ లో జరగబోతుంది. హంగేరి మ్యుజీషియన్స్ తో లండన్లో 15 రోజులపాటు ఈ సినిమా రీరికార్డింగ్ జరగబోతుంది. 13వ శతాబ్దం ఫీల్ తీసుకురావడానికి ఇళ‌యరాజ, గుణశేఖర్ తాపత్రయపడుతున్నారు.