ఏప్రిల్లో విశాఖ రైల్వే జోన్ ప్ర‌క‌ట‌న‌

కేంద్ర ప్ర‌భుత్వం వ‌చ్చే ఏప్రిల్‌లో విశాఖ‌ను రైల్వే జోన్‌గా ప్ర‌క‌టిస్తుంద‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి ఎన్‌.చంద్ర‌బాబునాయుడు తెలిపారు. తాను రైల్వే శాఖ మంత్రిని క‌లిసిన‌పుడు ఆయ‌న తాను ఏప్రిల్‌లో విశాఖ‌కు వ‌స్తాన‌ని, అపుడు విశాఖ రైల్వే జోన్ ప్ర‌క‌ట‌న చేస్తాన‌ని తెలిపిన‌ట్లు బాబు తెలిపారు. ఏపీకి గతంలో ప్రకటించిన రాయితీల వల్ల పెద్దగా ప్రయోజనం లేదని, హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్త‌రాంచ‌ల్‌కు ఇచ్చిన ప్యాకేజీలు త‌మ‌కు కూడా ఇవ్వాల‌ని కేంద్రాన్ని తాము కోరుతున్నామని బాబు చెప్పారు. కేంద్రం సహకరిస్తేనే ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే రాష్ర్టానికి పరిశ్రమలు వచ్చే పరిస్థితి లేదని ముఖ్యమంత్రి తెలిపారు. స్వర్గీయ నందమూరి తారక రామారావుకు ‘భారత రత్న’ ఇవ్వాలని సీఎం చంద్రబాబు కేంద్రాన్ని కోరారు. అదే విధంగా ఢిల్లీలో పీవీ స్మారక మెమోరియల్‌ను నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.- పి.ఆర్‌.