రాహుల్‌ ఆచూకీ చెబితే బహుమతి!

“బాబూ నీ కోసం నియోజకవర్గంలో అందరూ బెంగ పెట్టుకున్నాం. త్వరగా వచ్చేయ్‌.ఎవరూ ఏమీ అనరు” అంటూ ఎవరైనా తప్పిపోతే ప్రకటన ఇస్తాం. ‘ఫలానా వ్యక్తి కనపడుట లేదు. ఆచూకీ చెప్పిన వారికి తగిన పారితోషికం ఇస్తాం’’ అని పోస్టర్లు ముద్రించి బహిరంగ ప్రదేశాల్లో అతికిస్తాం. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ ప్రజలు అచ్చం ఇలాగే చేశారు. అయితే.. ఈ పోస్టర్లు సాక్షాత్తూ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ కోసం వేసినవి కావడం గమనార్హం. ఆయన ఆచూకీ చెబితే తగిన బహుమతీ ఇస్తామన్నారు. ‘‘మాట మాత్రం చెప్పకుండా.. ఏ దేశానికి వెళ్లావు’’ అని ప్రశ్నించారు. దీనిపై కాంగ్రెస్‌ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. దీన్ని పెద్దగా పట్టించుకోవద్దని.. ఆ పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్‌ సింఘ్వి కాంగ్రెస్‌ శ్రేణులకు సూచించారు. – పి.ఆర్‌.