పివిపి బ్యానర్లో మరోసారి బొమ్మాళి

పీవీపీ బ్యానర్‌లో మళ్ళీ అనుష్క నటించనుంది. ఇంతకుముందు ఆమె ఈ బ్యానర్‌లో నటించినప్పటికీ ఆశించన ప్రయోజనం నెరవేరలేదు. గతంలో అనుష్క ప్రధాన పాత్రలో బారీ బడ్జెట్‌తో తెలుగు, తమిళ్‌ బాషల్లో నిర్మించిన వర్ణ చిత్రం అట్టర్‌ ప్లాప్‌ అయింది. పివిపి బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రంపై అనుష్క అప్పటో ఎన్నో ఆశలు పెట్టుకుంది. భారీగా నష్టపోయిన నిర్మాత పొట్లూరి వర ప్రసాద్‌కు అనుష్క మరో చిత్రాన్ని చేయడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అయితే ఆ తరువాత బహుబలి, రుద్రమదేవి చిత్రాల్లో బిజి అయిపోవడం వల్ల అనుష్క తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేక పోయింది. ఇప్పుడు ఈ రెండు చిత్రాలు పూర్తి కావచ్చాయి. ప్రస్తుతం బహుబలి, రుద్రమదేవి చిత్రాలు ప్యాచ్‌వర్క్‌ జరుపు కుంటున్నాయి. వర్ణ చిత్రం ప్లాప్‌ అయినప్పుడు ఇచ్చిన మాట ప్రకారం అనుష్క పివిపి అధినేత పోట్లూరి వర ప్రసాద్‌కు డేట్స్‌ ఇచ్చింది. పివిపి బ్యానర్‌పై అనుష్క ప్రధాన పాత్రలో లేడి ఓరియేంటేడ్‌ చిత్రానికి నిర్మాత వర ప్రసాద్‌ సన్నాహలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రతిష్టమైన కథాంశంతో తెలుగు, తమిళ్‌ భాషల్లో నిర్మించనున్నారు. ప్రస్తుతం ఫీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతుంది. త్వరలో సెట్‌ మీదకు ఈ చిత్రం రానుంది.