జర నవ్వండి ప్లీజ్ 8

పండగ
భార్య : అక్కడ తాగుతూ ఉన్న అతన్ని చూశారా! ఐదేళ్ల క్రితం అతన్ని నేను తిరస్కరించాను.
భర్త : అదృష్టవంతుడు, అప్పటి నుంచీ సెలబ్రేట్‌ చేసుకుంటున్నాడు.
************
దొంగ దొరికింది
”విజయ్‌! నీకు ఎన్ని సార్లు చెప్పాలి? ప్రార్థన చేసేటప్పుడు అందరూ కళ్లు మూసుకోవాలని చెప్పాను కదా?”
”నిజమే. నేను కళ్లు మూసుకోలేదని నీకెలా తెలిసిందమ్మా?!”
************
హక్కు
టీచర్‌ మంచీ చెడ్డా గురించి పిల్లలకు చెబుతోంది.
”పిల్లలూ! ఉదాహరణకి ఒక వ్యక్తి పాకెట్‌లో చేయిపెట్టి అతని పర్సు నేను తీసుకున్నాననుకోండి నన్నేమంటారు?” అంది.
పిల్లలంతా ”అతని భార్య” అన్నారు.
************
పాత-కొత్త
మ్యూజియం అధికారి రాజుతో ”ఎంత పని చేశావయ్యా! ఐదువందల ఏళ్ల క్రితం విగ్రహాన్ని పగలగొట్టావే!” అన్నాడు.
రాజు ఊపిరి పీల్చుకుని ”ఔనా! నేనింకా కొత్తదేమో అనుకున్నాను” అన్నాడు.
************
శబ్దం
గైడు : ”నయాగరా జలపాతానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఇది ప్రపంచంలోకెల్లా పెద్ద జలపాతం. ఈ జలపాత శబ్దం ఎంతో గంభీరమైంది. ఇరవై సూపర్‌సానిక్‌ విమానాలు దీని దగ్గరగా వెళ్లినా వాటి శబ్దం కూడా మనకు వినిపించదు. ఇక్కడున్న స్త్రీలు మౌనంగా ఉంటే మనం జలపాతం శబ్దం వినవచ్చని మనవి చేస్తున్నా” అన్నాడు.