చర్చిపై దాడి

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ఓ చర్చిని, స్కూలుని గత శుక్రవారంనాడు బజరంగ్‌దళ్‌ కార్యకర్తలు ధ్వంసం చేసారు. జబల్‌పూర్‌ పరిసర ప్రాంతాలనుంచి వచ్చిన రెండువందల మంది క్రైస్తవులు బైబిల్‌ సదస్సును నిర్వహించుకుంటూ ఉండగా బజరంగ్‌దళ్‌ కార్యకర్తలు వారిపై దాడిచేసారు. ఇక్కడ మతమార్పిడులు జరుగుతున్నాయంటూ ఈ దాడికి పాల్పడ్డారు. ఈ సదస్సుకు హాజరైనవారిపై చేయి చేసుకున్నారు. దాడికి పాల్పడినవారిని శిక్షించకుంటే క్రైస్తవ పాఠశాలలను మూసివేస్తామని నిర్వాహకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.