Telugu Global
WOMEN

బాలింతల్లో నిద్రలేమిని ఇలా దూరం చేసుకోవచ్చు..

కొత్తగా తల్లి అయిన మహిళలు నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటారనే విషయం సహజంగా వింటూనే వింటాం. అయితే బాలింతల్లో నిద్రలేమి అప్పటికప్పుడు సమస్య మాత్రమే కాదు దీర్ఘకాలంలో ముప్పుగా మారే ప్రమాదం కూడా ఉంది.

బాలింతల్లో నిద్రలేమిని ఇలా దూరం చేసుకోవచ్చు..
X

కొత్తగా తల్లి అయిన మహిళలు నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటారనే విషయం సహజంగా వింటూనే వింటాం. అయితే బాలింతల్లో నిద్రలేమి అప్పటికప్పుడు సమస్య మాత్రమే కాదు దీర్ఘకాలంలో ముప్పుగా మారే ప్రమాదం కూడా ఉంది.

చంటి పిల్లలకు రాత్రి, పగలు అనే తేడా ఉండదు. ఎప్పుడు నిద్ర పోతారో, ఎప్పుడు మెలకువతో ఉంటారో చెప్పలేం..ఈ క్రమంలో కొంతమంది పసి పిల్లలు గంటల తరబడి నిద్రపోతే, మరికొందరు అలా ఓ అరగంట కునుకు తీసి.. ఆలోపే నిద్ర లేస్తుంటారు. కొందరు పగలు పడుకొని రాత్రి అంతా ఆడుతారు. ఇంతా లేచే సరికి తల్లి పక్కనే ఉండాలి. లేదంటే ఏడుపు మొదలుపెడతారు.

కాబట్టి పిల్లలు పడుకున్న సమయంలో ఇంటి పనులు చేసుకోవడం చాలామందికి అలవాటు..పిల్లలకు పాలిచ్చే క్రమంలో రాత్రుళ్లు నిద్ర ఉండదు. పని చేసుకోక తప్పని సరి పరిస్థితిలో పొద్దున్న నిద్ర ఉండదు.. దీంతో బాలింతల్లో నిద్రలేమి సమస్య ఎదురవుతుంటుంది. ఈ సమస్య నుంచి బయట పడాలి అంటే పనులన్నీ పక్కన పెట్టి పిల్లలు నిద్రపోయినప్పుడే తల్లులూ నిద్ర పోవాలంటున్నారు నిపుణులు. ఒకవేళ ఇంట్లో చిన్నారుల్ని చూసుకునే పెద్దవాళ్లుంటే కాసేపు పిల్లల బాధ్యతను వాళ్లకు అప్పగించి నిర్మొహమాటంగా విశ్రాంతి తీసుకోక తప్పదు.

అయితే వేళా పాళా లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు రమ్మంటే వచ్చేది కాదు కదా నిద్ర. నిజానికి బాలింతల్లో నిద్ర లేమికి ఇలా నిద్ర పట్టకపోవడమూ ఓ కారణమే. అలాగని నిద్రను దాటవేయకుండా సులభంగా నిద్ర పట్టడం కోసం ధ్యానం, శ్వాస సంబంధిత వ్యాయామాలు, కాసేపు నడక.. వంటివి సాధన చేస్తే మనసుప్రశాంతంగా మారి సుఖ నిద్రకు దారి తీస్తుంది.

అలాగా కొత్త తల్లులకు ప్రసవానంతర ఒత్తిడి చాలా సహజం. ఇందుకు కారణాలు అనేకం.శరీరంలో మార్పు రావడం సహజమే అని తెలిసినా కొంతమంది వాటిని అంగీకరించలేరు. దాంతో మానసిక ఒత్తిడి, ఆందోళనలకు గురవుతుంటారు. మళ్ళీ స్థితికి ఎప్పుడొస్తామో అన్న ఆలోచనల్లోనే నిరంతరం గడుపుతుంటారు. నిద్రలేమికి ఇదీ ఓ కారణమే! ఇలాంటి మానసిక ఆందోళనలు మీకే కాదు.. మీ చిన్నారికీ మంచివి కాదు. కాబట్టి వీటిని ఎంత త్వరగా దూరం చేసుకుంటే అంత మంచిది. ఇలాంటి ఆలోచనలు మనసులోకి రానప్పుడు నిద్ర కూడా సుఖంగా పడుతుందంటున్నారు నిపుణులు.

First Published:  9 Dec 2023 6:30 AM GMT
Next Story