Telugu Global
WOMEN

కమిలిన చర్మానికి కాఫీ ప్యాక్

కాఫీ.. అదొక ఎమోషన్ .. కానీ ఈ మండే ఎండల్లో కాఫీ అయితే కాస్త తక్కువే తాగుతాం. అందుకే ఈ సమ్మర్ లో కాఫీని, కాఫీ సువాసనని మిస్ అవ్వకుండా మీ చర్మాన్ని కాపాడుకోవడానికి వాడుకోవచ్చు.

కమిలిన చర్మానికి కాఫీ ప్యాక్
X

కాఫీ.. అదొక ఎమోషన్ .. కానీ ఈ మండే ఎండల్లో కాఫీ అయితే కాస్త తక్కువే తాగుతాం. అందుకే ఈ సమ్మర్ లో కాఫీని, కాఫీ సువాసనని మిస్ అవ్వకుండా మీ చర్మాన్ని కాపాడుకోవడానికి వాడుకోవచ్చు. తీవ్రమైన ఎండలకు చర్మం కమిలిపోకుండా, నల్లబడిన చర్మం తిరిగి కాంతిమంతం అవడానికి ఇదిగో ఇలా ఇంట్లోనే కాఫీ ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు.


కాఫీ– హనీ ఫేస్‌ మాస్క్‌..

చెంచా కాఫీకి,చెంచా తేనె కలిపి మిశ్రమాన్ని తయారు చేసి, దానిని కళ్ల కింద అప్లై చేసి 10-15 నిమిషాల పాటు ఉంచి, తేలికగా చేతులతో మసాజ్ చేసి శుభ్రమైన నీటితో కడిగేయాలి. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. డార్క్ సర్కిల్స్ సమస్య పరిష్కారం అవుతుంది. నార్మల్‌ స్కిన్‌ వీరికి ఈ ఫేస్ ప్యాక్ బాగా పని చేస్తుంది.


కాఫీ– పసుపు– పెరుగు మాస్క్‌..

ఒక గిన్నెలో కాఫీ పొడి, పెరుగు,పసుపు వేసి బాగా కలపాలి. ఈ పేస్ట్‌ని ముఖం మరియు మెడపై రాయండి. కొంత సమయం వరకు లేదా అది ఆరిపోయే వరకు వదిలివేయండి. తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇది మీ చర్మాన్ని పొడిగా చేస్తుంది.

కాఫీ అలోవెరా..

అలోవెరా జెల్‌ను ఒక టీస్పూన్ కాఫీ పౌడర్‌తో కలపండి. పేస్ట్ లా చేసుకొని దానిని ముఖానికి పట్టించి 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తర్వాత శుభ్రమైన నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. బ్లాక్ హెడ్స్ తొలగించడానికి ఈ ప్యాక్ ఉపయోగపడుతుంది. కాఫీలో యాంటీ ఆక్సిడెంట్లు మరియు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చర్మాన్ని మెరుగుపరచడంలో పని చేస్తాయి.

కాఫీ – లెమన్‌ మాస్క్‌..

టేబుల్‌ స్పూన్‌ కాఫీ పొడిలో టేబుల్‌ స్పూన్‌ నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పదిహేను నిమిషాల సేపు అలాగే ఉంచాలి. ఆ తర్వాత చన్నీటితో శుభ్రం చేయాలి. జిడ్డు చర్మం ఉన్నవారికి బాగా పనిచేస్తుంది.

ఈ ప్యాక్‌లు అన్నీ ట్యాన్‌ను తగ్గించడంతోపాటు చర్మరంధ్రాలను శుభ్రం చేస్తాయి కాబట్టి ఈ ప్యాక్‌లు వేసిన తర్వాత ముఖానికి క్లెన్సింగ్‌ అవసరం ఉండదు.

First Published:  27 April 2024 9:15 AM GMT
Next Story