My title

యుద్ధం శ‌రణం రిలీజ్ డేట్ ఫిక్స్‌

నాగ‌చైత‌న్య య‌మ స్పీడ్ మీద ఉన్నాడు. నిన్న‌నే త‌న కొత్త చిత్రం స‌వ్య‌సాచి పోస్ట‌ర్ రిలీజ్ చేశాడు. ఇవాళ త‌న కొత్త చిత్రం రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాడు. నాగ చైతన్య చేస్తున్న తాజా చిత్రం ‘యుద్ధం శరణం’ మేకింగ్ చివరి దశకు చేరుకుంది. దాదాపు చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. ప్యాచ్ వ‌ర్క్‌లు ఈ వారంలో పూర్తి చేయాల‌ని నిర్ణ‌యించారు.  టీజర్ తో ఈ సినిమా ఇప్ప‌టికే పాజిటివ్ క్రేజ్ ను సంపాదించింది. దీంతో  ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 8న విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు నిర్ణ‌యించారు. కొద్దిసేపటి క్రితమే పోస్ట‌ర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి దర్శకుడు కృష్ణ ఆర్వి మరిముత్తు. ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి హీరోయిన్. సాయి కొర్రపాటి నిర్మించిన ఈ సినిమాతో హీరో శ్రీకాంత్ పూర్తిస్థాయి విలన్ గా  ప‌రిచ‌య‌మ‌వుతున్నారు.  పెళ్లి చూపులు’ ఫేమ్ వివేక్ సాగర్ సంగీతం అందిస్తుండగా నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. ఈ సినిమా హిట్ అయితే చైతూ హ్యాట్రిక్ హిట్ కొట్టినట్టు అవుతుంది.