My title

ఫిరాయింపుదారుల మీదే పోస్టా? – మరో నెటిజన్‌ అరెస్ట్

ఏపీలో ఫిరాయింపు ఎమ్మెల్యేలను విమర్శించినందుకు గాను ఒక నెటిజన్‌ను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు.  కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన తోట రాజేశ్‌ను మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. బద్వేలు ఫిరాయింపు ఎమ్మెల్యే జయరాములు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాజేష్‌ను అరెస్ట్ చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. రాత్రి పోలీసులు పేరుతో ఐదుగురు వ్యక్తులు రాజేశ్‌ ఇంటికి వెళ్లారు. ఆయన ఇంట్లో లేకపోవడంతో ఫోన్‌ చేసి స్టేషన్‌కు రప్పించారు. గుడివాడ రెండో టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ వచ్చిన రాజేశ్‌ను రాత్రికి రాత్రే కడప జిల్లా బద్వేల్‌కు తీసుకెళ్లారు. అయితే అరెస్ట్ చేసిన విషయాన్ని కుటుంబసభ్యులకు కూడా పోలీసులు సమాచారం ఇవ్వలేదు.