విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వం లో సునీల్

160

కమెడియన్ నుంచి హీరో గా మారిన సునీల్ ప్రస్తుతం గడ్డు కాలం లో ఉన్నాడని చేపొచ్చు. ఎందుకంటే హీరో గా సునీల్ కి హిట్స్ కంటే కూడా ఫ్లాప్స్ ఎక్కువ ఉన్నాయి. అసలు హిట్ లేక ఇబ్బందిపడుతున్న సంగతి అందరికి తెలిసిందే. ఇదిలా ఉంటే హీరో గా సునీల్ స్టార్ట్ అయిన ఒక రెండు ప్రాజెక్ట్స్ ని ప్రొడ్యూసర్స్ ఆపేసారు. అయితే మళ్ళీ సునీల్ కెరీర్ హీరో గా క్లోజ్ అవుతుంది అనే టైం లో ఇప్పుడు సునీల్ కి ఒక మంచి ఆఫర్ వచ్చింది. అవును లేటెస్ట్ గా జరిగిన ఒక మీడియా ఇంటర్వ్యూ లో సునీల్ మాట్లాడుతూ “బాహుబలి” కి రచయిత అయిన విజయేంద్ర ప్రసాద్ తో ఒక సినిమా చేయనున్నట్లు తెలిపారు. విజయేంద్ర ప్రసాద్ చెప్పిన కథ నచ్చడంతో సునీల్ వెంటనే ఆ ప్రాజెక్టుకు ఒప్పుకున్నానని, త్వరలోనే ఆ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని ఆయన అన్నారు. విజయేంద్రప్రసాద్ గతంలో “రాజన్న” ఇంకా “శ్రీవల్లి” వంటి మూవీస్ కి రచయితగా, డైరెక్టర్‌ గా పనిచేశారు. ఇకపోతే హీరో గా సునీల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ అయిన “2 కంట్రీస్” త్వరలోనే రిలీజ్ కానుంది. ఎన్. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ యొక్క ఫస్ట్ లుక్ రీసెంట్ గా విడుదలయింది.

NEWS UPDATES

CINEMA UPDATES