My title

సుప్రింకోర్టు మార్గదర్శకాల అమలుకు సిద్ధమైన మోడీ

అధికారంలోకి రావ‌డంతోనే మందీ మ‌ర్బ‌లం.. హంగూ ఆర్బాటం అనేవి స‌హ‌జాతి స‌హ‌జం. తాము ప్ర‌త్యేక‌మ‌ని, అధికారంలో ఉన్నామ‌ని అనుక్ష‌ణం నిరూపించుకునేందుకు నేత‌లు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు. అయితే బీహార్‌లో మాత్రం నాయ‌కులే కాకుండా ఇతరులుకూడా అధికారంలో ఉన్న‌వారి గౌర‌వాల‌ను దుర్వ‌నియోగం చేస్తుంటారు. అధికారంలో ఉన్న‌వారికి అధికారుల‌కూ కూడా హోదాకీ త‌గిన గుర్తింపు పొందాల‌నే త‌హ‌త‌హ ఉంటుంది. అందుకే వారు ఉప‌యోగించే వాహ‌నాల మీద‌ రంగు దీపం వెలుగుతుండాల‌ని కోరుకుంటారు. అధికారంలోకి రాగానే మొదట చేసే ప‌ని వారు ఉప‌యోగించే వాహ‌నాల‌కు రంగు బ‌ల్బులు పెట్టించ‌డం. ఆ దీపం లేనివాహ‌నం ఎక్క‌ని వి.ఐ.పి.లు కూడా ఉంటారు.

ఇది పంజాబ్‌లో ఏ స్థాయికి చేరిందంటే పోలీసులను త‌ప్పించుకునేందుకు స్మగ్లర్లు రెడ్ లైట్ పెట్టుకొని మ‌రీహాయిగా మ‌త్తుపదార్ధాలు ర‌వాణా చేసుకుంటున్నారు ఇపుడు పంజాబ్‌లో కొత్త‌గా అధికారంలోకి వ‌చ్చిన కాంగ్రెస్ ప్ర‌భుత్వం సి.ఎం. కెప్టెన్ అమ‌రీంద‌ర్‌సింగ్ రెడ్‌లైట్ సంస్కృతికి స్వ‌స్తి చెప్పాడు. ఇక‌నుంచి రాజ్యాంగ‌బ‌ద్దంగా అధికారంలో ఉన్న వారికి త‌ప్పించి మిగిలిన వాహ‌నాలు దేనిమీదా బుగ్గ‌లైట్ ఉండ‌కూడ‌దు. గ‌తంలో బిజెపి అకాళీద‌ళ్ అధికారంలో ఉన్న‌పుడు వంద‌ల‌కొద్దీ ప్ర‌భుత్వ వాహ‌నాల‌కు రెడ్‌లైట్స్ అమ‌ర్చిన కాంట్రాక్ట‌ర్ ఇపుడు వాటిని పీకేసీ కొత్త కాంట్రాక్ట్ ద‌క్కించుకునే య‌త్నంలో ఉన్నాడు. ఏమి జ‌రిగినా ప్ర‌భుత్వాల ఇష్టాల‌కు ఖ‌ర్చు మాత్రం ప్ర‌జ‌లే భ‌రించాలి. అలాగే ఢిల్లీలో కూడా ఈ బుగ్గ కార్ల సంస్కృతికి కేజ్రీవాల్ ఎప్పుడో స్వస్తిచెప్పాడు.

సుప్రింకోర్టు చాలా కాలం నుంచి ఈ బుగ్గ కార్ల సంస్కృతికి స్వస్తి చెప్పాలని కోరుతుంది. రాష్ట్రపతి, ప్రధాని లాంటి అతికొద్దిమంది తప్పా మిగిలిన వాళ్ళు ఈ బుగ్గకార్లు వాడకుండా చూడాలని పభుత్వాలని ఆదేశించింది. సుప్రింకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఇపుడు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా బుగ్గ కార్లకు స్వస్తి పలికే ఆలోచనలో ఉంది.