My title

వాళ్లకు మోడీలో వివేకానందుడు కనబడుతున్నాడట !

ఒక తెలుగు వెబ్‌సైట్‌లో  ప్రచురితమైన వార్త అందరికీ ఆశ్చర్యం గొలుపుతోంది. ‘స్వామి వివేకానంద, మోదీకి పోలికలు’ అంటూ ఆ వెబ్ సైట్ ప్రచురించిన ఆ వార్త స్క్రోలిన్ వెబ్ సైట్ లో వచ్చిన కథనానికి కొంత తమ సొంత కవిత్వం జోడించి వెబ్‌సైట్‌ నిర్వాహకులు రాసిన కథనం.

ఈ కథనం ప్రకారం ప్రధానమంత్రి నరేంద్రమోడీకి, స్వామి వివేకానందకు మధ్యన కొన్ని పోలికలు కొట్టొచ్చినట్టు వాళ్లకి కనిపించాయట. ఇద్దరి పేర్లలోనూ పోలిక ఉందట. ఇద్దరూ ప్రసంగాలలో దిట్టలట. వీరిరువురూ తమ ప్రసంగాల ద్వారా ప్రేక్షకులను విశేషంగా ఆకర్షిస్తారట.

వీళ్లు దేశంలో చేసిన ప్రసంగాలకన్నా అమెరికాలో చేసిన ప్రసంగాలకే ఎక్కువ ప్రాముఖ్యం లభించినదట. దుస్తులు ధరించడంలోనూ, తగిన భంగిమల్లో ఫొటోలకు ఫోజులివ్వడానికి ఇద్దరూ చాలా ఇష్టపడతారట…. ఇలా మోడీని పొగడడానికి మహోన్నత వ్యక్తి వివేకానందుణ్ణి మోడీ స్థాయికి కుదించి కలిపి వర్ణించింది చాలదన్నట్టు వివేకానందుడికి లేని చెత్త అలవాట్లను ఆయనపై రుద్దింది. వివేకానందుడికి ఫొటో స్టూడియోల్లో గడపడం, అద్దం ముందు జుట్టు సరిచేసుకుంటూ సోకులుపోవడం ఇష్టమన్నట్లుగా రాసింది.

అంతటితో ఆగకుండా వివేకానందుడికి, మహాత్మా గాంధీకి కెమెరాలముందు ఫొటోలకు ఫోజులివ్వడంలో ఉన్న నైపుణ్యం గురించి  తన పరిశోధనలను తవ్వి తలకెత్తుకుంది. ముక్తాయింపుగా గాంధీ, వివేకానందుడికన్నా మోడీకే ఫొటోలు దిగడంలో ఎక్కువ నైపుణ్యం ఉందని తన పరిశోధనా ఫలితాలతో తేల్చిపారేసింది.