My title

బీ కేర్ ఫుల్….. ఎక్కువగా టీవీ చూస్తే షుగర్!

ఈ మధ్య.. ఏ దేశంలో చూసినా.. షుగర్ వ్యాధి బాధితులు కనిపిస్తున్నారు. మన దేశంలో అయితే.. ఇది మరీ ఎక్కువ. ఈ వ్యాధి రావడానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఎక్కువగా తినడం, తక్కువగా వ్యాయామం చేయడం… అలాగే.. వంశపారంపర్యంగా వచ్చే అవకాశం…. ఇలా చాలానే ఉన్నాయి. ఇప్పుడు…. వీటిలో…. ఎక్కువగా టీవీ చూడడం వల్ల కూడా షుగర్ వ్యాధి వస్తుందన్న పాయింట్ ను మనం యాడ్ చేసుకోవాలంటున్నారు…. సైంటిస్టులు.

లండన్, బర్మింగ్ హామ్, లీసెస్టర్ ప్రాంతాల్లో.. తొమ్మిది, పది ఏళ్ల మధ్య వయసున్న దాదాపు 5 వేల మంది పిల్లలపై…. సెయింట్ జార్జ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. మూడేళ్లుగా వీళ్ల అలవాట్లను పరిశీలించారు. పూర్తిగా అధ్యయనం చేశారు. ఇందులో.. టీవీలు, కంప్యూటర్లు అంటూ రోజులో ఎక్కువ సమయం గడిపిన పిల్లలకు.. షుగర్ వచ్చే సూచనలు ఎక్కువగా కనిపించాయని చెప్పారు. ఆకలిని నియంత్రించే హార్మోన్ పెరుగుతున్నట్టు గుర్తించామన్నారు.

ఇది పిల్లల్లో.. చాలా ప్రమాదకరమైన పరిణామమని అంటున్న డాక్టర్లు.. పిల్లలను చిన్నప్పటి నుంచే టీవీలు, కంప్యూటర్ల విషయంలో కంట్రోల్ చేయాలని సూచిస్తున్నారు.