My title

కోహ్లి నిజంగానే అక్కడే చూశారా..?

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి సంబంధించిన ఒక ఫొటో ఇప్పుడు ఇంటర్నెట్‌లో చర్చలపాలైంది. యాంకర్ కాళ్ల వైపు కోహ్లి తదేకంగా చూస్తున్నట్టుగా ఉన్న ఫొటోపై నెటిజన్ల నుంచి స్పందన భారీగానే ఉంది. ఐపీఎల్ హోరాహోరీగా సాగుతున్న నేపథ్యంలో అర్చన విజయ అనే టీవీ వ్యాఖ్యాత కోహ్లీని ఇంటర్వ్యూ చేయడానికి అతను ప్రాక్టిస్ చేస్తున్నచోటుకు వచ్చింది. ఆమె కెమెరా వైపు చూసి మాట్లాడుతుంటే కోహ్లి మాత్రం మరో చోట ఫోకస్ పెట్టినట్టుగా ఉంది. అర్చన విజయ వేసుకున్న జీన్స్‌ను కోహ్లి తదేకంగా చూస్తూ ఉండిపోయారు. ఆమె వేసుకున్న ఫ్యాషన్ జీన్స్ కూడా కోహ్లి చూపులకు ఒక కారణమే.

వైరల్‌గా మారిన ఈ ఫొటోపై నెటిజన్ల స్పందనా అధికంగానే ఉంది. కోహ్లీ చాలామందికి ఇంటర్వ్యూలు ఇస్తుంటాడని, ఎప్పుడూ మరోలా వ్యవహరించే వ్యక్తి కాదని కొందరు సర్టిఫై చేస్తున్నారు. అతనికి ఫ్యాషన్ మక్కువ కాబట్టి చూసి ఉంటాడని ఇంకొందరు సమర్థిస్తున్నారు. అసలు ఈ ఫొటోను అనుష్క శర్మ చూసిందా లేదా అని మరికొందరు సెటైర్లు వేస్తున్నారు. బహుశా అనుష్క శర్మ కోసం అలాంటి జీన్స్‌ ఫ్యాంటే కొనే ఉద్దేశం ఉంది కాబోలు.. అందుకే దాన్ని పరిశీలిస్తున్నాడని మరికొందరు కామెంట్స్‌ చేస్తున్నారు.