My title

పెళ్లిచూపులు హీరోకి నాని ప్రచారం

పెళ్లిచూపులు తర్వాత విజయ్ దేవరకొండ నటించిన సినిమాలేవీ ఆడలేదు. ఆడకపోవడం అటుంచి కనీసం రిలీజ్ అయినప్పుడు బజ్ కూడా క్రియేట్ అవ్వలేదు. అయితే అర్జున్ రెడ్డి ఆ కేటగిరీ కిందకు రాదు. ఎఁదుకో మరి ఈ సినిమాకు మొదట్నుంచి మంచి క్రేజ్ ఏర్పడింది. టీజర్ తో ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. తర్వాత ఓ సాంగ్ తో అంచనాలు భారీగా పెరిగాయి. అందుకే ఇప్పుడు ప్రమోషన్ కూడా భారీగా చేస్తున్నారు.

ఈ సినిమా ట్రయిలర్ ను భారీ ఎత్తున చేస్తున్నారు. నేచురల్ స్టార్ నానిని రంగంలోకి దించారు. తర్వాత ఆడియో ఫంక్షన్ కూడా చేస్తారట. సినిమాను ఆగస్ట్ 25న థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. లో బడ్జెట్ లో తెరకెక్కించిన ఈ సినిమాను ఇప్పటికే భారీ మొత్తానికి అమ్మేశారు.

నైజాంలో ఎక్కువగా డిస్ట్రిబ్యూట్ చేసే అభిషేక్ పిక్చర్స్ సంస్థ.. అర్జున్ రెడ్డి ఆలిండియా థియేట్రికల్ రైట్స్ ను దక్కించుకుంది. పెళ్లిచూపులు తర్వాత ఈ సినిమాపైనే ఎక్కువగా ఆశలు పెట్టుకున్నాడు విజయ్ దేవరకొండ.