My title

మరొక ఫ్యామిలీ థ్రిల్లర్ లో విక్టరీ వెంకటేష్

విక్టరీ వెంకటేష్ ఈ ఏడాది “గురు” సినిమాని రిలీజ్ చేసి మంచి హిట్ ని అందుకున్నారు. కాని ఆ మూవీ తరువాత ఆయన ఇంకా ఏ మూవీని ఒప్పుకోలేదు. ఆ మధ్య  క్రిష్ దర్శకత్వం లో ఒక మూవీ ని చేస్తున్నాడు అని అన్నారు. కానీ ఆ మూవీ కూడా పట్టాలేక్కలేదు. ఇదిలా ఉంటే ఈ మధ్య చాలా కధలు విన్న వెంకటేష్ ఫైనల్ గా ఒక ఫ్యామిలీ థ్రిల్లర్ కథకి ఓకే చెప్పాడట. దర్శకుడు తేజ చెప్పిన కథ నచ్చి ఆ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు వెంకీ అనే టాక్ ఫిలిం నగర్ లో నడుస్తుంది. ఈ ఫ్యామిలీ థ్రిల్లర్ మూవీ లో వెంకటేష్ ఒక కాలేజీ ప్రొఫెసర్ గా కనిపిస్తారట. మరి ఈ మూవీ లో వెంకటేష్ సరసన ఎవరు హీరోయిన్ గా చేస్తారు అనే విషయం ఇంకా బయటకి రాలేదు. ఇకపోతే డైరెక్టర్ తేజ రీసెంట్ గా “నేనే రాజు నేనే మంత్రి” అంటూ వచ్చి హిట్ కొట్టారు. ఇప్పుడు అదే ఊపు లో ఆయన ఈ సినిమాని స్టార్ట్ చేస్తారు అని తెలుస్తుంది. ఆల్రెడీ తన కెరీర్ లో “దృశ్యం” లాంటి ఫ్యామిలీ థ్రిల్లర్ లో నటించాడు వెంకీ. మరి అన్ని అనుకున్నట్టు జరిగితే ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళబోతుంది.