వెంకటేష్ తో మల్టీ స్టారర్ లో సాయి ధరం తేజ్

120

“రాజా ది గ్రేట్” సినిమా సక్సెస్ తరువాత దర్శకుడు అనిల్ రావిపూడి దిల్ రాజు నిర్మాణంలో మరో సినిమా చేయబోతున్న సంగతి అందరికి తెలిసిందే. “ఎఫ్ 2” (ఫన్ అండ్ ఫస్టేషన్) టైటిల్ తో తెరకెక్కే ఈ మూవీ లో హీరో గా విక్టరీ వెంకటేష్ నటిస్తున్నట్టు ఆల్రెడీ ప్రకటించేసారు మూవీ యూనిట్. ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ శరవేగంగా జరుగుతుంది. అయితే లేటెస్ట్ న్యూస్ ప్రకారం మల్టీ స్టారర్ అయిన ఈ ప్రాజెక్ట్ లో మరో హీరో నటించడానికి ఓకే చెప్పాడట. సుప్రీమ్ హీరో అయిన సాయి ధరమ్ తేజ్ వెంకటేష్ తో నటించడానికి అంగీకరించాడని తెలుస్తోంది. ఈ స్క్రిప్ట్ కు సాయి అయితే బాగుంటాడని భావించిన అనిల్‌ రావిపూడి అతన్ని కలవడం, కథ వినిపించడం అన్ని జరిగిపోయాయి. గతంలో సాయి ధరమ్ తేజ్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన “సుప్రీమ్” సినిమా మంచి విజయం సాధించింది.

ఇక అనిల్ రావిపూడి చెప్పిన ఈ లైన్ కూడా నచ్చడం తో వెంటనే మూవీ కి ఓకే చెప్పాడు సాయి ధరం తేజ్. ఇక ఈ మూవీ తానూ నటిస్తున్నది వెంకటేష్ పక్కనే అని తెలియాగానే సాయి ధరం తేజ్ కి ఇది ఒక డ్రీం లాగ ఉందట. మొత్తానికి అటు మెగా ఫ్యామిలీ ఇటు దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి ఇద్దరు హీరో లు వచ్చి మల్టీ స్టారర్ చేస్తున్నారు.

NEWS UPDATES

CINEMA UPDATES