My title

అఖిల్ తో కలిసి స్టెప్పులు వేయనున్న వెంకటేష్

అక్కినేని అఖిల్ ప్రస్తుతం తన రెండో సినిమా అయిన “హలో” తో బిజీ గా ఉన్నాడు. కెరీర్ స్టార్టింగ్ లోనే “అఖిల్” వంటి మూవీ తో భారీ డిసాస్టర్ ని తన ఖాతా లో వేసుకున్నాడు అఖిల్. అయితే ఈ విషయాన్ని దృష్టి లో పెట్టుకున్న “హలో” టీం కూడా మూవీని చాలా జాగ్రత్త గా తెరకెక్కిస్తున్నారు. విక్రం కె కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ యొక్క ఫస్ట్ లుక్ చాలా డిఫరెంట్ గా ఉండటం తో అందరికి ఈ మూవీ పై కొంచెం ఇంట్రెస్ట్ కలిగింది. ఇదిలా ఉంటే ఈ మూవీ లో ఇంకో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఉందట. ఆ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏంటి అంటే విక్టరీ వెంకటేష్ ఈ మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ చేయనున్నాడట. అవును తన మేనల్లుడు అయిన అఖిల్ కోసం వెంకటేష్ ఈ స్పెషల్ సాంగ్ ని చేయడానికి ఒప్పుకున్నాడు అని తెలుస్తుంది. ఇంతకు ముందు నాగ చైతన్య హీరో గా వచ్చిన “ప్రేమమ్” మూవీ లో కూడా వెంకటేష్ అతిధి పాత్రలో కనిపించి తళుక్కుమని మెరిసాడు. మరి ఈ వెంకటేష్ స్పెషల్ సాంగ్ “హలో” మూవీ కి ప్లస్ అవుతుందనే అనుకుంటున్నారు ఫిలిం నగర్ జనాలు.