My title

ఆ గోల‌తో మాకేం సంబంధం అంటున్న వెంక‌య్య‌

త‌మిళ‌నాడులో జ‌రుగుతున్న అనూహ్య ప‌రిణామాల గురించి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్పందించారు. అన్నాడీఎంకే పార్టీలో జరుగుతున్న వ్యవహారాలలో కేంద్రానికి కానీ, బీజేపీకి కానీ ఎలాంటి సంబంధం లేదని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఢిల్లీలో విలేకరులతో మాట్లాడిన వెంక‌య్య నాయుడు అన్నాడీఎంకే పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఆ పార్టీ అంతర్గత వ్యవహారమని పేర్కొన్నారు. వాటితో తమ పార్టీకి కానీ, కేంద్ర ప్రభుత్వానికి కానీ ఏమీ ఆసక్తి లేదని అన్నారు. స‌ద‌రు ఎపిసోడ్ వెనుక కేంద్రం ఉంద‌నేది గిట్ట‌ని వారి విమ‌ర్శ‌ల‌ని వెంక‌య్య కొట్టిపారేశారు.
ఇదిలా ఉండ‌గా త‌మిళ‌నాడు విప‌క్ష నేత‌, డీఎంకే నాయకుడు స్టాలిన్ పార్టీ నేతలతో భేటీ అయ్యారు. అన్నాడీఎంకేలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. అన్నాడీఎంకేలో వైరి వర్గాలు రెండు సయోధ్య యత్నాలలో ఉండటం, శశికళ, దినకరన్ లను పార్టీకి దూరం పెట్టాలని నిర్ణయించడం వంటి పరిణామాలపై ఈ భేటీలో చర్చించనున్నారు.