My title

హరినాయుడు, దుర్వాసనాయుడు వచ్చి అడిగారు…. నగిరి నుంచి….

నాటి హీరోయిన్‌ వాణివిశ్వనాథ్‌ తన రాజకీయ రంగప్రవేశంపై స్పష్టత ఇచ్చారు. త్వరలోనే రాజకీయాల్లోకి వస్తున్నట్టు చెప్పారు. తన కోసం టీడీపీ నేతలే వచ్చి కలిశారని ఆమె ఒక ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు. ప్రజలకు సేవ చేయాలంటే భాష అవసరం లేదు, పెద్దపెద్ద చదువులు అవసరం లేదన్నారు. మనసుమనసు కలిస్తే చాలన్నారు వాణివిశ్వనాథ్‌. భాష వల్ల ఇబ్బంది ఏమీ ఉండదన్నారు. తన తండ్రికి జోతిష్యం తెలుసని తాను రాజకీయాల్లోకి వస్తానని చిన్నప్పుడే చెప్పారన్నారు.

చంద్రబాబును త్వరలోనే కలుస్తానన్నారు. తెలుగు ప్రజలకు ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతోనే తాను వస్తున్నట్టు వివరించారు. ప్రజల కష్టాలు తెలుసుకుని రాజకీయాల్లో రాణిస్తానన్నారు. కొద్దిరోజుల క్రితం నగిరి నియోజకవర్గానికి చెందిన చలపతినాయుడు, శ్రీహరినాయుడు, దుర్వాసనాయుడు వచ్చి తనను టీడీపీలో చేరాల్సిందిగా కోరారన్నారు. నగరి నియోజకవర్గం తమిళనాడుకు పక్కనే ఉంటుంది కాబట్టి తనకు అనుకూలంగానే ఉంటుందన్నారామె. చంద్రబాబు ఆదేశిస్తే ఏ బాధ్యతలైనా నిర్వహిస్తానన్నారు. నగరి నుంచి రాజకీయ ప్రస్తానం మొదలుపెట్టాలని తనకు ఉందన్నారు.

చంద్రబాబు రాముడైతే తాను ఒక ఉడతను అన్నారామె. రాజకీయాల్లోకి వస్తే టీడీపీలోనే చేరుతానని చాలా కాలం క్రితమే చెప్పానన్నారు. అతి త్వరలోనే చంద్రబాబును కలుస్తానని ఆమె అన్నారు. రోజా తనకు పోటీ కాదన్నారు. నగరిలో రోజా నిలబడినా మరొకరు నిలబడిగా పార్టీల వారిగానే పోటీ ఉంటుందన్నారు. తనకు రోజా మధ్య ఎలాంటి వ్యక్తిగత కోపాలు లేవన్నారు. రోజా మంచి యాక్టర్ అని కితాబిచ్చారు వాణివిశ్వనాథ్. మొత్తం మీద రోజాను తట్టుకునేందుకు వాణి విశ్వనాథ్‌ను టీడీపీ తెరపైకి తెస్తోందన్న విషయాన్ని ఆమె కూడా ధృవీకరించారు.
చూడాలి రోజాకు.. వాణివిశ్వనాథ్ ఏమేరకు పోటీ ఇస్తారో!.