My title

బీజేపీలోకి క‌న్న‌డ సూప‌ర్ స్టార్‌!

క‌ర్నాట‌క‌పై బీజేపీ క‌న్నేసింది. ఈ సారి ఎలాగైనా అక్క‌డ అధికారంలోకి రావాల‌ని ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇప్పుడు పొలిటిక‌ల్ స్కెచ్‌లు అమ‌లు చేయ‌డం మొద‌లెట్టింది. ఇందులో భాగంగా బీజేపీ బ‌లోపేతంపై దృష్టిపెట్టింది. కాంగ్రెస్‌లో ఉన్న సినీ గ్లామర్‌కు పోటీగా త‌మ పార్టీలో సినీ గ్లామ‌ర్ పెంచే ప్ర‌య‌త్నాల‌ను బీజేపీ మొద‌లెట్టింది. క‌న్న‌డ సూప‌ర్ స్టార్ ఉపేంద్ర‌ను త‌మ పార్టీలోకి ఆహ్వానించింది. ప్ర‌స్తుతం క‌ర్నాట‌క ప‌ర్య‌ట‌న‌లో ఉన్న బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స‌మ‌క్షంలో ఆయ‌న పార్టీలో చేరుతార‌ని ప్రచారం సాగుతోంది.  శనివారం సాయంత్రం ఉపేంద్ర మీడియా సమావేశంలో మాట్లాడతారని, తన రాజకీయ ప్రవేశం గురించి వెల్లడిస్తారని అంటున్నారు. రాజకీయాల పట్ల ఉపేంద్రకు ఆసక్తి ఉన్నట్లు, కొత్త పార్టీ పెట్టే యోచనలో ఉన్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. కొత్త పార్టీ పెట్టే ఆలోచనను విరమించుకుని ఆయన బిజెపిలో చేరతారని ప్రచారం జరుగుతోంది. శనివారం సాయంత్రానికి ఉపేంద్ర రాజకీయ రంగ ప్రవేశంపై స్పష్టత వస్తుందని భావిస్తున్నారు.