My title

డిసెంబర్ లో ఆడియో లాంచ్ చేసుకోబోతున్న పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ మూవీ

పవన్ కళ్యాణ్ తన 25 వ చిత్రాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. దాదాపు షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం యూరప్ లో పాటల చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ సాంగ్స్ షూట్ తో నవంబర్ లో ఈ మూవీ యొక్క పూర్తి షూటింగ్ కంప్లీట్ అవుతుంది. అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీ ఆడియో లాంచ్ ని డిసెంబర్ లో గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట ప్రొడ్యూసర్స్. ఇది పవన్ కళ్యాణ్ 25 వ చిత్రం కావడం తో ఈ మూవీని చాలా స్పెషల్ గా ప్రమోట్ చేయాలని డిసైడ్ అయ్యారు మేకర్స్. ఇదిలా ఉంటే ఈ మూవీలో పవన్ కళ్యాణ్ సరసన కీర్తీ సురేష్, అను ఎమన్యుఎల్ హీరోయిన్స్ గా నటిస్తుండగా ఆది పినిశెట్టి ఒక ముఖ్య పాత్ర లో నటిస్తున్నాడు. హారిక హాసిని క్రియేషన్స్ పై త్రివిక్రమ్ కి అత్యంత సన్నిహితుడు అయిన ఎస్.రాధాకృష్ణ ఈ మూవీని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఇకపోతే ఈ మూవీ యొక్క ఫస్ట్ లుక్ ఇంకా టైటిల్ ని దీపావళి సందర్భం గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి “అజ్ఞాతవాసి” అనే టైటిల్ ఫిక్స్ చేసారు అనే టాక్ నడుస్తుంది.