My title

ట్రెక్కింగ్ స్టార్ ఆమ్ర‌పాలి

వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి మళ్ళీ వార్తల్లోకి వ‌చ్చారు. ఈసారి మ‌రో గుట్టల్లో ట్రెక్కింగ్ చేశారు. అటవీ శాఖ ఆధ్వర్యాన దేవునూరు ఇనుప గుట్టల్లో జరిగిన ట్రెక్కింగ్ లో ఆమె పాల్గొన్నారు. ఏదో ఒక కార్యక్రమం ద్వారా ఎప్పుడూ ఆమ్ర‌పాలి  యాక్టివ్‌గా ఉంటారు. ఇప్పుడు మ‌రోసారి ట్రెక్కింగ్ చేశారు. ధ‌ర్మ‌సాగ‌ర్ మండ‌లం ఇనుపరాతి గుట్టలపై అటవీ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ట్రెక్కింగ్‌ నిర్వహించారు. విద్యార్థులు, ఔత్సాహికులతో కలిసి దేవునూర్‌ గుట్టలపై ట్రెక్కింగ్‌ చేశారు. గతంలో మహబూబాబాద్ జిల్లాలోని ఇనుప ఖనిజ ప్రాంతాలైన బయ్యారం చెరువు, పెద్దగుట్టల్లో కలెక్టర్ ప్రీతీ మీనా, ఆమ్రపాలి కలిసి నడిచిన వీడియోలు హల్ చల్ చేశాయి. ఇటీవలే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పాండవుల గుట్టపై ఆమ్రపాలి ట్రెక్కింగ్ చేశారు.

మళ్ళీ తాజాగా అదే సాహసానికి పూనుకొన్నారు. ఆమె వెంట ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ సిబ్బంది కొందరు కూడా ఉన్నారు. ట్రెక్కింగ్‌ వంటి కార్యక్రమాల్లో పాల్గొనడం తనకెంతో ఇష్టమని ఆమ్ర‌పాలి తెలిపారు. ట్రెక్కింగ్‌కు ఈ ప్రాంతం అనువైందని, ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసి ఎక్కువ మంది సందర్శకులు వచ్చేలా తీర్చిదిద్దుతామని చెప్పారు.