My title

టాలీవుడ్ స్టుడియో రౌండప్

కల్యాణ్ రామ్ సినిమా

ఓవైపు కాజల్ తో ఎమ్మెల్యే అనే సినిమా చేస్తూనే, మరోవైపు తమన్నాతో రొమాన్స్ చేస్తున్నాడు కల్యాణ్ రామ్. అవును.. ఈ నందమూరి హీరో ప్రస్తుతం ఒకేసారి రెండు సినిమాలు చేస్తున్నాడు. వీటిలో తమన్నాతో చేస్తున్న సినిమాను తాజాగా స్టార్ట్ చేసిన కల్యాణ్ రామ్.. ఆ మూవీకి సంబంధించి ఇవాళ్టితో ఓ షెడ్యూల్ పూర్తిచేశాడు. జయేంద్ర డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్. ఈస్ట్ కోస్ట్ బ్యానర్ పై ఈ మూవీ తెరకెక్కుతోంది.

నా పేరు సూర్య

బన్నీ సినిమా నా పేరు సూర్య.. గ్యాప్ లేకుండా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే హైదరాబాద్ లో ఓ షెడ్యూల్ ముగించిన యూనిట్.. సెప్టెంబర్ 24న మరో షెడ్యూల్ కోసం ఊటీ వెళ్లింది. ఇవాళ్టితో ఆ షెడ్యూల్ కూడా కంప్లీట్ అయింది. దసరాకు కూడా గ్యాప్ తీసుకోకుండా వర్క్ చేసిన యూనిట్.. రేపట్నుంచి కొన్ని రోజులు రెస్ట్ తీసుకొని నెక్ట్స్ షెడ్యూల్ ప్రారంభించబోతోంది. వచ్చే ఏడాది సమ్మర్ ఎట్రాక్షన్ గా రాబోతోంది నా పేరు సూర్య.

2.0

భారతదేశంలోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా 450 కోట్ల రూపాయలతో తెరకెక్కుతోంది 2.0 సినిమా. ఈ సినిమాకు సంబంధించి ఫైనల్ షెడ్యూల్ రేపట్నుంచి ప్రారంభం అవుతుంది. ముంబయిలో ప్రారంభంకానున్న ఈ షెడ్యూల్ లో రజనీకాంత్-ఎమీ జాక్సన్ మధ్య ఓ సాంగ్ షూట్ చేస్తారు. ఈ షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత యూనిట్ అంతా కలిసి దుబాయ్ లో ఆడియో ఫంక్షన్ కు వెళ్తుంది. ఈనెల 27న దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా పార్క్ లో ఆడియో రిలీజ్ ఫంక్షన్ చేస్తున్నారు.

కాలా

2.0తో పాటు మరోవైపు కాలా సినిమాను కూడా సైమల్టేనియస్ గా పూర్తిచేస్తున్నాడు రజనీకాంత్. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ను 60 శాతానికి పైగా కంప్లీట్ చేసిన రజనీకాంత్.. ప్రస్తుతం చెన్నైలో వేసిన ప్రత్యేకమైన సెట్ లో కాలా సినిమాకు సంబంధించిన ఓ సాంగ్ షూటింగ్ కంప్లీట్ చేశాడు.

రాజుగాడు

రాజ్ తరుణ్ లేటెస్ట్ మూవీ రాజుగాడు. సంజనా రెడ్డిని దర్శకురాలిగా పరిచయం చేస్తూ ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా.. 2 పాటలు మినహా పూర్తయింది. పెండింగ్ లో ఉన్న 2 పాటల్లో ఒక పాట షూటింగ్ ను తాజాగా ప్రారంభించారు. హైదరాబాద్ అన్నపూర్ణ స్టుడియోస్ లో వేసిన ప్రత్యేకమైన సెట్ లో ఈ సాంగ్ షూటింగ్ జరుగుతోంది.