My title

ఎక్స్‌ప్రెస్ టీవీ ఆస్తులు అటాచ్‌

తెలుగు న్యూస్ ఛానల్‌ ఎక్స్‌ప్రెస్‌ టీవీ ఆస్తులు అటాచ్ అయ్యాయి.   చిగురుపాటి జయరాం అనే వ్యాపారి స్థాపించిన ఈ ఛానల్‌ ఏడాదిగా ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదు. దీంతో వారు ఆందోళన చేస్తూనే ఉన్నారు. కానీ యజమాని చిగురుపాటి జయరాం మాత్రం స్పందించలేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్‌ సంఘం లేబర్ కమిషన్‌లో కేసు వేసింది. సానుకూల మార్గంలో జీతాలు రాబట్టేందుకు ప్రయత్నించినా స్పందన లేదు. దీంతో ఎక్స్‌ప్రెస్‌ టీవీకి చెందిన రూ. మూడున్నర కోట్ల విలువైన ఆస్తులను లేబర్ కమిషన్‌ అటాచ్‌ చేసింది. ఉద్యోగుల జీతాలు రాబట్టేందుకు మరో మార్గం లేకనే తాము లేబర్ కమిషన్‌ను ఆశ్రయించినట్టు సంఘం  అధ్యక్షుడు అల్లం నారాయణ చెప్పారు. వెంటనే అటాచ్‌ చేసిన ఆస్తులను వేలం వేసి ఉద్యోగులకు ఛానల్ బకాయి పడ్డ కోటిన్నర రూపాయలను చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.