My title

నాసా ఛాలెంజ్‌కు తెలంగాణ విద్యార్ధులు

తెలంగాణ‌కు చెందిన ఐదుగురు ఇంజ‌నీరింగ్ విద్యార్ధులు నాసా రోవ‌ర్ ఛాలెంజ్‌కు ఎంపిక‌య్యారు. వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 12 నుంచి 14 వరకు జ‌రిగే ఈ ఛాలెంజ్‌లో ఈ విద్యార్ధులు త‌మ ప్ర‌తిభ‌ను మ‌రోసారి చాటుకోనున్నారు. అమెరికాలోని అల‌బామాలో ఈ పోటీలు జ‌ర‌గ‌నున్నాయి.

భార‌త్ నుంచి ఎంపికైన నాలుగు జ‌ట్ల‌లో తెలంగాణ జ‌ట్టు ఒక‌టి. ఎంపికైన ఈ విద్యార్ధులంతా వ‌రంగ‌ల్ జిల్లాలో ఎస్ ఆర్ ఇంజ‌నీరింగ్ కాలేజీలో చ‌దువుతున్నారు. వీరంతా హ్యూమ‌న్ ఎక్స్‌ప్లోరేష‌న్ రోవ‌ర్ ఛాలెంజ్‌లో భాగ‌స్వామ్యులు కానున్నారు.

అమెరికాలో జ‌రిగే ఈ రోవ‌ర్ ఛాలెంజ్‌లో ప్ర‌పంచ వ్యాప్తంగా 23 దేశాల నుంచి విద్యార్ధులు పాల్గొంటున్నారు. వీరంద‌రూ చంద్రుని బ‌గ్గీ డిజైన్‌ను త‌యారు చేయ‌నున్నారు.

తెలంగాణ నుంచి ఎంపికైన విద్యార్ధులు మ‌నోజ్ అనే ఫ్యాక‌ల్టీ ఆధ్వ‌ర్యంలో ఈ ప్రాజెక్టులో పాలు పంచుకోనున్నారు.

రోవ‌ర్ ఛాలెంజ్‌కు ఎంపికైన విద్యార్ధుల‌లో …పి. పౌల్ వినీత్‌, ప్ర‌కాశ్ రైనేని, పి శ్ర‌వ‌న్ రావ్‌, రోండ్ల దిలీప్ రెడ్డి, ఆనంద్ వెనిశెట్టి స్నేహ ఉన్నారు.